MDCL: రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కమిషనరేట్ల సంస్కరణలలో పలుమార్పులు జరిగాయి. ఇంతకాలం సైబరాబాద్ పరిధిలో ఉన్న శామీర్పేట పోలీస్ స్టేషన్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో కలిసింది. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కింద ఈ పోలీసు యంత్రాంగం మొత్తం విధులు నిర్వర్తించనుంది. మల్కాజ్గిరి కమిషనరేట్ సమీపంలోనే ఈ పోలీస్ స్టేషన్ ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.