AP: కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను వదులుకోమని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ అంశంలో తమపై పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కంటే మిన్నగా నీటి హక్కులు కాపాడే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కృష్ణా జలాల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.