NLR: కావలి వ్యవసాయ మార్కెట్లో కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి శనివారం తనిఖీలు నిర్వహించారు. రైతులకు అందుతున్న సదుపాయాలు, కొనుగోలు విధానం, ధరల నిర్ణయ ప్రక్రియ, తూకాల్లో పారదర్శకత వంటి కీలక అంశాలపై మార్కెట్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో పంటలు తీసుకొచ్చే రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.