ADB: నార్నూర్ మండలం కొత్తపల్లి(హెచ్) గ్రామంలోని లంబాడీల దీక్షభూమి వద్ద ఈ నెల 11న సేవాలాల్ జాతర మహాసభ నిర్వహిస్తున్నట్లు దీక్షాగురు ప్రేమ్ సింగ్ మహారాజ్ సూచించారు. ఆదివారం ఎంపీ గోడం నగేష్‌ను జాతర నిర్వాహక సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు జాతర ఉంటుందని పేర్కొన్నారు.