భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. జైపూర్ వాక్స్ మ్యూజియంలో ఆమె మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే నిర్వాహకులు ఆమె ఫొటోలు, కొలతలను సేకరించారు. త్వరలోనే ఈ మ్యూజియంలో దిగ్గజాలు సచిన్, ధోనీ, కోహ్లీ సరసన హర్మన్‌ప్రీత్ విగ్రహం కొలువుదీరనుంది.