TPT: రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ వైసీపీ నాయకులు మండిపడ్డారు. సోమవారం తిరుపతి కలెక్టరేట్ ముందు ఖాళీ బిందెలతో వారు నిరసన తెలియజేశారు. తుడా మాజీ ఛైర్మన్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమకు నీళ్లు రాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని, ఇదే జరిగితే మేమేంటో చూపిస్తామని హెచ్చరించారు. అనంతరం వైకాపా నేతలు, కార్యకర్తల నినాదాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది.