AP: దేశంలోనే తెలుగుకు ఘనమైన చరిత్ర ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. వందలాది భాషలు ఉన్నా.. మన దేశంలో కేవలం 6 భాషలకు ప్రాచీన హోదా లభించిందన్నారు. హిందీ, బెంగాలీ తర్వాత దేశంలో ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు అని గుర్తుచేశారు. ప్రపంచం మొత్తంలో సుమారు 10 కోట్లమంది తెలుగు మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభలకు దాదాపు 40 దేశాల ప్రతినిధులు వచ్చారని చెప్పారు.