ఆధార్ PVC కార్డుల విషయంలో UIDAI కీలక నిర్ణయం తీసుకుంది. PVC కార్డు ఛార్జీలను రూ.50 నుంచి రూ.75కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రింటింగ్, సురక్షిత డెలవరీ, లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ కార్డుల ధరలను జనవరి 1 నుంచి అమలులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించింది. 2020లో ఈ సేవలు ప్రారంభించగా.. ఛార్జీలను పెంచడం ఇదే తొలిసారి.