MDCL: ఉప్పల్ పరిధి కావేరి నగర్, శ్రీనగర్ కాలనీ, హనుమాన్ నగర్, గణేష్ నగర్, సెవెన్ హిల్స్ కాలనీ, ఈస్ట్ బాలాజీ హిల్స్, వెస్ట్ బాలాజీ హిల్స్, ఆదర్శనగర్, సాయి నగర్, సహా చిల్కానగర్ డివిజన్ ప్రాంతాల్లో దోమల బెడద విపరీతంగా ఉందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. రాత్రి సమయంలో దోమల బెడద కారణంగా కనీసం నిద్రపోలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు.