GNTR: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కే. అచ్చెన్నాయుడు బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. చుట్టుగుంటలోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో అధికారులు, మిర్చి వ్యాపారులు, ఏజెంట్లతో ఆయన సమావేశమవుతారు. రాబోయే సీజన్లో మిర్చి ధరలు పడిపోకుండా చూడటం, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ భేటీలో చర్చించనున్నారు.