E.G: రాజమండ్రిలో ఈనెల 11న ‘SAY NO TO DRUGS’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, మాదకద్రవ్యాల రహితంగా ఉండటం యొక్క ప్రాముఖ్యత గురించి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు.