PDPL: ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఒగ్గు పూజారులతో పట్నాలు వేయించి, బోనాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మదన పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తలనీలాలు సమర్పించి, కోడె మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.