SKLM: ఆమదాలవలసలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీశ్రీశ్రీ నవగ్రహ సహిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర యాగ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, వివిధ హోమాలు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. యాగంలో పాల్గొనడం వల్ల కుజ, కాలసర్ప, ఏలినాటి శని దోషాలు నివారించి శుభఫలితాలు కలుగుతాయని పండితులు తెలిపారు.