అమెరికాలో తెలుగు యువతి గొడిశాల నికితా రావు హత్య కేసులో ప్రధాన నిందితుడు చిక్కాడు. ఈనెల 2న భారత్ వచ్చిన అనుమానితుడు అర్జున్ శర్మను తమిళనాడులో ఇంటర్పోల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన తర్వాత పరారైన అర్జున్ ఇండియాకు వచ్చినట్లు గుర్తించి, పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. కాగా, ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.