BDK: మణుగూరు మండల కేంద్రంలో వైద్యుల ఆధ్వర్యంలో ఇవాళ ఆశ వర్కర్స్ డే నిర్వహించారు. ఈ వేడుకలకు వైద్యులు నిశాంత్ రావు పాల్గొని నెల వారి రికార్డులను పరిశీలించారు. అనంతరం పలువురు రోగులకు బీపీ, షుగర్, డెంగీ, మలేరియా, వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం ఆశా వర్కర్లకు నూతన యూనిఫాంలు అందజేశారు.