SRCL: వైద్యారోగ్య శాఖ సిబ్బంది క్షేత్ర స్థాయిలో, ప్రజలకు అన్ని వ్యాధులపై అవగాహన కల్పించాలని, ఏ.ఎన్.సీ రిజిస్ట్రేషన్లు, ఎన్.సీ.డీ స్క్రీనింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీ.హెచ్.సీ)ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.