JN: జాఫర్ ఘడ్ మండలంలోని ఉప్పుగల్ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్ సాంబరాజుకు బీజేపీ నేతలు, వార్డు సభ్యులు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో కోతులు, కుక్కల బెడదకు శాశ్వత పరిష్కారం చూపించాలని, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని, గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించేలా చర్యలు చేపట్టాలని నేతలు సర్పంచ్‌ను కోరారు.