MLG: రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో మేడారం జాతరను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. శాసనమండలిలో మల్లన్న మాట్లాడుతూ.. జాతర స్పెషల్ పేరుతో భారం మోపకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి మేడారం మహా జాతరకు వెళ్లే మహిళలకు ఫ్రీ-గా ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు.