మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలంటూ నర్సింగ్ కళాశాల విద్యార్థినిలు తరగతులను బహిష్కరించి కళాశాల ప్రధాన గేటు ముందు బైఠాయించి సోమవారం ఆందోళన చేపట్టారు. హాస్టల్ వసతి, తాగునీరు, మరుగుదొడ్లు, ల్యాబ్ సదుపాయాలు, భద్రత వంటి మౌలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.