NZB: పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో డ్రంకన్ డ్రైవ్ కేసులు 102 నమోదైనట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. రూ.9.50 లక్షల జరిమానా విధించినట్లు చెప్పారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపద్దని హెచ్చరించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు.