ADB: బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్‌ను మండల కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయకులు ఆయనకు పుష్పగుచ్చం అందజేసి నియోజకవర్గంలోని పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని గజేందర్ సూచించారు.