కడప కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం వీబీ జీ రామ్ జీ పథకం ప్రచార పోస్టర్ను కలెక్టర్ శ్రీధర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు నిర్వహించనున్న గ్రామ సభల్లో వీబీ జీ రామ్ జీ పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయిలో పథకం లక్ష్యాలు, ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.