TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వం పిటిషన్ వేసింది. మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్ను రేపు సుప్రీం విచారించనుంది. కాగా ఇవాళ ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరికొంత మంది ముఖ్యనేతలను విచారించే అవకాశం ఉంది.