JGL: కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచడంపై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం టపాసులు కాల్చారు. పీఎం కిసాన్ నిధి పథకం డబ్బులు తమకు పంట పెట్టుబడులకు ఉపయోగపడతాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.