TG: ఆత్మవిశ్వాసం, హుందాతనం కలబోసిన అందాల పోటీల వేదికపై తెలుగు మహిళ భార్గవి పసగడ ఘనవిజయం సాధించారు. ప్రతిష్టాత్మక ‘మిసెస్ ఇండియా సుప్రనేషనల్’ విజేతగా నిలిచి ఆమె కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. కేవలం అందంతోనే కాకుండా తనకు లభించిన బహుమతి మొత్తంలో 50 శాతాన్ని వితంతుల సంక్షేమం కోసం విరాళంగా ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు.