ప్రజా ప్రాముఖ్యత కలిగిన అత్యవసర విషయంపై చర్చించేందుకు సభ దైనందిన కార్యక్రమాలను పక్కన పెట్టాలని కోరుతూ ప్రవేశపెట్టేదే ‘వాయిదా తీర్మానం’. సభలో ముందుగా నిర్ణయించిన అజెండాను కాదని, తక్షణం ఈ అంశంపైనే చర్చ జరగాలని సభ్యులు దీని ద్వారా కోరుతారు. స్పీకర్ అనుమతిస్తేనే దీనిపై చర్చ జరుగుతుంది. సాధారణంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు దీనిని అస్త్రంగా వాడుతాయి.