ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్రంగా స్పందించింది. టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌లో పర్యటించలేమని స్పష్టం చేసింది. భారత్‌లో జరగాల్సిన తమ మ్యాచ్‌లను శ్రీలంక వంటి తటస్థ వేదికలకు తరలించాలని ఐసీసీకి లేఖ రాసింది. భారతలో తమ ఆటగాళ్ల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.