కర్నూలు జిల్లా కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు వెంటనే పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో డీఆర్వోతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.