వికారాబాద్: పరిగి పట్టణంలో జరిగిన జిల్లా సైన్స్ ఫెయిర్లో భాగంగా తాండూరు పట్టణానికి చెందిన గంగోత్రి విద్యాలయం మొదటి స్థానం దక్కించుకుంది. ప్లాంట్ పవర్ విభాగంలో 10వ తరగతి విద్యార్థిని సారానదీమ్ టీం విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ ఇందూర్ రాములు, ప్రిన్సిపల్ గోపాల్ నాయుడు, వైస్ ప్రిన్సిపల్ సరితా దేవిలు అభినందించారు.