కరీంనగర్: తమ సొంత డబ్బుల కోసం వృద్ధాప్యంలో రోడ్డెక్కిన రిటైర్డ్ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెండింగ్లో ఉన్న గ్రాట్యుటీ, డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ వీరు చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ని త్రీటౌన్ పోలీసులు అడ్డుకొని స్టేషన్కు తరలించారు. ఏళ్ల తరబడి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా, నిరసనను అణిచివేయడాన్ని ఖండించారు.