SKLM: ఆమదాలవలసలో మహిళ పై దాడి చేసి బంగారు గొలుసు దొంగిలించిన ఘటన కలకలం రేపింది. సోమవారం ఉదయం చంద్రయ్యపేటలో నివాసం ఉంటున్న కర్ణం సుజాత అనే మహిళపై ఓ గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి, ఆమె మెడలో ఉన్న 3.5 తులాల బంగారు చైన్‌ను లాక్కొని పరారైనట్లు ఆమె తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.