భారత్, న్యూజిలాండ్ మధ్య ఈనెల 11 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కోహ్లీని భారీ రికార్డు ఊరిస్తోంది. విరాట్ మరో 25 పరుగులు చేస్తే సచిన్‌ను అధిగమించి అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా 28,000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. విరాట్ ఇప్పటివరకు 623 ఇన్నింగ్స్‌ల్లో 27,975 రన్స్ చేయగా.. సచిన్ 644 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.