AP: రైతులకు పాస్బుక్ల పంపిణీ పవిత్రమైన కార్యక్రమం అని సీఎం చంద్రబాబు అన్నారు. భూమి అనేది ప్రతి ఒక్కరికీ భావోద్వేగ విషయమన్నారు. ప్రాణం పోయినా భూమి కోల్పోయేందుకు రైతులు ఇష్టపడరని చెప్పారు. కరోనా సమయంలోనూ పనిచేసి అందరికీ అన్నం పెట్టారని గుర్తు చేశారు. సున్నితమైన సమస్యపై పెట్టుకోవద్దని గత సీఎంకు చెప్పా.. వినలేదని పేర్కొన్నారు.