తూ.గో జిల్లాలో నిమ్మకాయల ధరలు పడిపోవడంతో సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత జూన్లో 50 కిలోల బస్తా ధర రూ. 2 వేలు ఉండగా, ప్రస్తుతం సగానికి తగ్గిందని ఆరోపిస్తున్నారు. కనీసం కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా దక్కడం లేదని వాపోతున్నారు. ప్రధానంగా దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం నుంచి ఇతర మండలాల్లో 3,200 హెక్టార్లలో నిమ్మ సాగు చేస్తున్నారని పేర్కొన్నారు.