NZB: సంక్రాంతి వేళ చైనా మాంజాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సామ శ్రీనివాస్ హెచ్చరించారు. శనివారం ధర్పల్లిలోని కిరాణా దుకాణాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి, నిషేధిత మాంజాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. చైనా మాంజా వాహనదారులకు ప్రాణాంతకంగా మారుతోందని, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.