ATP: గార్లదిన్నె మండలం సంజీపురం గ్రామంలో మరణించిన ఆదినారాయణ కుటుంబానికి ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని శనివారం పరామర్శించి రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. తాము అండగా ఉంటామని ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సామాజిక బాధ్యతగా ఈ సాయం చేసినట్లు పేర్కొన్నారు.