కృష్ణా: గుడివాడ మండలం లింగవరం గ్రామ పరిధిలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా చెట్ల తొలగింపు పరిసరాల శుభ్రత పనులను శానిటరీ సిబ్బంది శనివారం చేపట్టారు. రహదారుల పక్కన, కాలువల వెంట, ప్రజా ప్రదేశాలలో అడ్డంకిగా మారిన చెట్ల కొమ్మలను తొలగించి, ప్రజలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణను పటిష్టం చేశారు.