BDK: సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా ఇండ్లకు తాళం వేసి దూరప్రాంతాలకు ప్రయాణాలు చేసే వారికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ శనివారం పలు కీలక సూచనలు చేశారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లే సమయంలో దొంగలు చోరీలకు పాల్పడే అవకాశాలున్నాయని, అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా స్థానిక పోలీసులకు తప్పనిసరిగా సమాచారం అందించాలని ఆయన కోరారు.