WGL: మామునూర్ ఎయిర్పోర్టు కారణంగా మూసివేతకు గురవుతున్న రంగశాయిపేట-గాడిపల్లి రోడ్డుకు ప్రత్యామ్నాయంగా 5.50KM పొడవు కొత్త రోడ్డు నిర్మాణానికి భూసేకరణ ప్రతిపాదన సిద్ధమైంది. గాడిపల్లి నుంచి నక్కలపల్లి, అక్షర టౌన్షిప్, బొల్లికుంట చెరువు మీదుగా KMM రోడ్డును కలిపేందుకు 36.28 ఎకరాల భూమి సేకరించాలని, రూ.95 కోట్లు మంజూరు చేయాలని R&B అధికారులు నివేదిక పంపారు.