కోర్టు భవనం పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఢిల్లీలోని సాకేత్ కోర్టులో జరిగింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతిడి చేతిపై వర్క్ ప్రెజర్ తట్టకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసి ఉందని గుర్తించారు. తనకు 60 శాతం శారీరక వైకల్యం ఉందని, దాని వల్లే పని పూర్తి చేయలేకపోతున్నాని రాసుకోచ్చాడట. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.