ప్రకాశం: హనుమంతుని పాడు మండల పరిసర ప్రాంత ప్రజలకు ఎస్సై మాధవరావు మంగళవారం కీలక సూచనలు జరిచేశారు. ముందుగా మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలో ప్రతి గ్రామంపై పోలీస్ నిఘా ఉంటుందని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే కోడిపందాలు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.