TG: వరంగల్ కోట భూముల ఆక్రమణలపై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆ భూములను పురావస్తుశాఖవిగా గుర్తించాలని కోరారు. కోట పరిసరాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని పేర్కొన్నారు. ఆక్రమణదారులపై పురావస్తుశాఖ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని.. వాటిని ఏఎస్ఐ భూములుగా రికార్డుల్లో సవరించాలని వివరించారు. చారిత్రక సంపదను కాపాడటంలో ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.