ADB: అందులకు జ్ఞాన కవాటాలు ప్రసాదించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ అని వికలాంగుల జిల్లా కార్యదర్శి చుక్క బోట్ల పోచన్న అన్నారు. సోమవారం తాంసి మండలంలోని కప్పర్ల ZPHS పాఠశాలలో ఆయన జయంతిని స్థానిక సర్పంచ్ గండ్రత్ అరుణ్‌తో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.