అమెరికా మాట వినకపోతే వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్కు మాజీ అధ్యక్షుడు మదురో కంటే ఘోరమైన గతి పడుతుందని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ‘అట్లాంటిక్’ పత్రికకు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనిజులా కొత్త నాయకత్వం తమ ఆదేశాలను బేఖాతరు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు.