సత్యసాయి: రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి సోమవారం శివ మాల దీక్ష స్వీకరించారు. శివనామ స్మరణ మధ్య భక్తిశ్రద్ధలతో ఆయన ఈ దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక కళ్యాణం కోసం, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శివుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల క్షేమం కోరుతూ ఈ దీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు.