అన్నమయ్య: పీలేరు రేంజి పరిధిలో వన్యప్రాణులను వేటాడి వాటి పొలుసులతో అక్రమ వ్యాపారం చేస్తున్న ఏడుగురిని అటవీ అధికారులు అరెస్టు చేశారు. డీఆర్ఐ అధికారులతో కలిసి నిర్వహించిన సోదాల్లో నిందితుల వద్ద నుంచి 18.740 కిలోల అలుగు పొలుసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని పీలేరు కోర్టుకు హాజరుపరిచారు.