AP: ప్రయాణికులకు సంక్రాంతి సందర్భంగా APSRTC గుడ్ న్యూస్ తెలిపింది. పండుగకు వివిధ ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చే వారిని దృష్టిలో పెట్టుకుని 3,500 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. తిరుగు ప్రయాణం కోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల మధ్య 4,575 బస్సులు నడపనుంది. హైదరాబాద్కు 1800, బెంగళూరుకు 200, చెన్నైకి 75 ప్రత్యేక బస్సులు వేసింది.