విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ ప్లేట్ గ్రూప్ విజేతగా బీహార్ నిలించింది. మణిపూర్‌తో జరిగిన ఫైనల్లో బీహార్ 6 వికెట్ల తేడాతో గెలిచి టైటిల్‌ను ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన మణిపూర్ 47.5 ఓవర్లలో 169 పరుగులకే చతికిలపడింది. షబీర్ ఖాన్ 7 వికెట్లు తీసి మణిపూర్ పతనాన్ని శాసించాడు. అనంతరం బరిలోకి దిగిన బీహార్ కేవలం 31.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది.