TG: సామాజిక తెలంగాణ సాధన కోసం కలిసి నడుద్దామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసే పార్టీ అవసరం ఉందన్నారు. జాగృతి కార్యాలయంలో కవితను తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు ప్రజా సంఘాలు, ఉద్యోగ, కుల సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు కలిసి.. ఆమెకు మద్దతిచ్చారు.