అన్నమయ్య: రైల్వే కోడూరు ప్రజల ప్రాణాలే ప్రథమమని ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తెలిపారు. గత పాలనలో నిర్వీర్యమైన అంబులెన్స్ వ్యవస్థను ఎన్డీఏ ప్రభుత్వం పునఃపటిష్టం చేసి, 108, 104 సేవలను వేగవంతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. జీపీఎస్ పర్యవేక్షణ, సిబ్బందికి క్రమం తప్పని జీతాలతో సేవలు మెరుగుపడ్డాయని చెప్పారు.